Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా ప్రమోషన్ కోసమే 'కబాలి' లీక్ వార్తలు?

'కబాలి' ఫీవర్ ప్రపంచాన్ని పట్టుకున్న వేళ, మరింత ప్రమోషన్ కోసం చిత్రం ముందే ఆన్ లైన్లో లీక్ అయిందని నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారని, రూమర్స్ ను ప్రోత్సహించారని తెలుస్తోంది. వారం రోజుల నుంచి రజనీ కొత్త చిత్రం ఆన్ లైన్లో ఉందన్న వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని చూడాలని కోట్లాది మంది అభిమానులు గంటల తరబడి నెట్లో వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీన్ని సెన్సార్ బోర్డు వారే లీక్ చేశారన్న కథనాలు రావడంతో, బోర్డు చైర్మన్ నిహలానీ కూడా మీడియా ముందుకు వచ్చి తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ ఉదయం నిర్మాతలు స్పందిస్తూ, సినిమా లీక్ అయిన దాఖలాలు లేవని, తాము 250 వెబ్ సైట్లపై నిఘా ఉంచామని, ఎక్కడా లీక్ అయినట్టు సమాచారం లేదని చెప్పారు. లీక్ వార్తలు వచ్చిన వారం రోజుల తరువాత, రిలీజ్ కు రెండు రోజుల ముందు నిర్మాతల నుంచి ఈ ప్రకటన రావడంతో ప్రమోషన్ కోసం రూమర్స్ ను ప్రోత్సహించారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

More Telugu News